హైదరాబాద్ : భారీ వర్షాలకు బహదూర్‌పురలోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోకి చేరిన వరద నీటిని వెంటనే తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సమీపంలోని మీరాలం చెరువు పూర్తిస్థాయిలో నిండిపోయి జూ పార్క్ లోకి నీరు భారీగా చేరింది. విషయం తెలుసుకున్న మంత్రి జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, వెస్ట్ జోన్ జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్ లతో ఫోన్ లో మాట్లాడి జూ పార్క్ లోని నీటిని తొలగించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తక్షణమే జీహెచ్ఎంసీ మాన్ సూన్ సిబ్బందిని జూ పార్క్ కు పంపించి ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా చూడాలని ఆదేశించారు. జూ పార్క్ క్యూరేటర్ రాజశేఖర్ తో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు.