నల్లగొండ : నాగార్జున సాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. జలాశయం ఇన్ఫ్లో 2,50,136 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1,68,025 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 588.80 అడుగులుగా ఉంది. నాగార్జున సాగర్ జలాశయం గరిష్ఠ నీటి నిల్వ 312.0450 టీంఎసీలు. ప్రస్తుత నీటి నిల్వ 308.4658 టీఎంసీలు. సాగర్ నిండు కుండలా మారడంతో ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.