Pranahitha | కౌటాల : మహారాష్ట్రలో ఎగువన కురుస్తున్న వర్షాలకు కౌటాల మండలంలోని తుమ్మిడి హెటి వద్ద గల ప్రాణహిత నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాణహిత నది పరవళ్ళు తొక్కుతోంది. బుధవారం ఉదయం పుష్కర ఘాటును తాకుతూ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం నుండి ఇప్పటివరకు నదిలో ఇంత భారీగా వరద నీరు రావడం ఇదే మొదటిసారి. కౌటాల మండలంలో ఇప్పటివరకు ఎక్కడ కుంటలు, చెరువులు నిండిన దాఖలాలు లేవు. దీంతో నదిలోని వరద ప్రవాహాన్ని చూసేందుకు మండలవాసులు ప్రాణహిత పుష్కర ఘాట్ వద్దకు వెళ్లి తిలకిస్తున్నారు. ఆ పరవళ్లను చూసి పరవశించిపోతున్నారు.