మల్దకల్, ఏప్రిల్ 3 : మొక్కజొన్నకోత మిషన్‌లో పడి బాలుడు మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం మేరకు .. మల్దకల్ మండలం నీలిపల్లికి చెందిన నాగన్న, అఖిలకు రాజు (జీవన్ (6)) ఒక్కడే కుమారుడు.
గురువారం నాగన్న తన పొలంలో మక్క పంటను హార్వెస్టర్‌తో కోయిస్తున్నాడు. అక్కడే రాజు ఆడుకుంటూ ఉండగా.. గమనించని హార్వెస్టర్ డ్రైవర్ అతడి వైపు వెళ్లగా మిషన్ బాలుడిని లాగేసుకున్నది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే మిషన్‌ను ఆపివేయించగా.. శరీరం ముద్దగా మా రింది. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఎస్సై నందికర్ ఘటనా స్థలానికి చేరుకొని డైవర్‌పై కేసు నమోదు చేసి చేశారు.