దుబ్బాక, డిసెంబర్ 4 : తన భార్యను వార్డు మెంబర్‌గా గెలిపిస్తే ఐదేండ్లపాటు వార్డు ప్రజలకు కటింగ్, షేవింగ్ ఉచితంగా చేస్తానంటూ ఓ అభ్యర్థి భర్త విచిత్ర హామీ ఇచ్చాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి పంచాయతీ 6వ వార్డు మెంబర్ స్థానం బీసీ మహిళకు రిజర్వు కాగా నాయీబ్రాహ్మణ వృత్తి చేస్తున్న మంగలారపు శ్రీకాంత్ తన భార్య శివానితో నామినేషన్ వేయించాడు. వార్డు ప్రజలను కలుస్తూ ప్రచారం చేస్తున్నాడు. తన సెలూన్‌కు వచ్చిన వారికి ఓట్లను అభ్యర్థిస్తున్నాడు. వార్డు అభివృద్ధితోపాటు ఐదేండ్లపాటు వార్డులోని పురుషులకు ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తానని హామీ ఇచ్చాడు.