కోనరావుపేట, జనవరి 12 : ఐదేళ్ల చిన్నారిపై ఓ వృద్ధుడు లైంగికదాడికి పాల్పడిన ఘ టన రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోనరావుపేట మండలం కొలనూర్‌లో ఓ చిన్నారిపై అంగన్వాడీ ఆయా భర్త అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చి న్నారి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వైద్యులను సంప్రదించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ప్రశాంత్‌రెడ్డి విచారణ చేపట్టారు. వారం క్రితమే ఘటన జరిగిందని అధికారుల విచారణలో వెల్లడికాగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నా రు.
ఏడేండ్ల బాలికపైలైంగికదాడి ; పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు
మిర్యాలగూడ, జనవరి 12 : ఏడేండ్ల బాలికపై లైంగికదాడి జరిగిన ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని తాళ్లగడ్డలో చోటుచేసుకుంది. శనివారం బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అందులో ఇద్దరు మైనర్లు ఉన్నా రు. ఈ ముగ్గురితో బాధితురాలి కుటుంబానికి దగ్గరి బంధుత్వం ఉన్నట్టు పోలీసులు ఆదివారం వెల్లడించారు.