హైదరాబాద్ : నేటి నుంచి హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరుగనున్నాయి. కేంద్ర కమిటీ సమావేశాల్లో జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలపై చర్చిస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సమావేశాల్లో చర్చిస్తామన్నారు. పార్టీ 23వ అఖిల భారత మహాసభల ముసాయిదా తీర్మానం రూపొందిస్తాం. మహా సభల రెండు నెలల ముందు డ్రాఫ్ట్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.
ప్రతి పార్టీ సభ్యుడు ముసాయిదా తీర్మానంపై కేంద్ర కమీటీకి సవరణలు పంపవచ్చని సూచించారు.
ఏప్రిల్లో కేరళలోని కన్నూరులో అఖిల భారత మహా సభలు జరగనున్నాయని వివరాలను వెల్లడించారు.