POCSO Act | లైంగిక దాడి కేసులో ఐదుగురికి జీవిత ఖైదు.. బాధితురాలికి 12 లక్షల పరిహారం
బాలికపై సామూహిక లైంగికదాడి కేసులో ఐదుగురికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.20 వేలు జరిమానా విధిస్తూ జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు వెల్లడించారు.
- బాధితురాలికి 12 లక్షల పరిహారం
మెట్పల్లి, జూలై 15 : బాలికపై సామూహిక లైంగికదాడి కేసులో ఐదుగురికి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.20 వేలు జరిమానా విధిస్తూ జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో 2020 అక్టోబర్‌లో బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటనలో లోకిని రాజేశ్ (22), దారంగుల సాయికుమార్ (21), మొగిలిపాక అనిల్ (19),కుంచెపు శివ (19), కుంచెపు వెంకటేశ్(22)పై మెట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో పోక్సో చట్టం కింద అప్పటి ఎస్ఐ సదాకర్ కేసు నమోదుచేశారు.
కేసులోని ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రత్న పద్మావతి ఐదుగురు నిందితులను దోషులుగా తేల్చి జీవిత ఖైదుతోపాటు ఒక్కొక్కరికి రూ.20 వేలు జరిమానా విధించారు. బాధిత బాలికకు రూ.12 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

