ఖమ్మం : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకండా కురుస్తున్న వర్షాలకు(Heavy rain) వాగులు, వంకలు పొంగి పొర్లు తున్నాయి. భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా( Khammam ) ఖమ్మం రూరల్ మండలం తీర్థాల వద్ద ఆకేరు వాగు(Akeru vagu) ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాగు ఉధృతిని చూడడానికి వెళ్లిన ఐదుగురు వ్యక్తులు గల్లంతయ్యారు(Five persons drowned). మొదటగా ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన బాధితులు ప్రస్తుతం ఫోన్ కూడా అందుబాటులో లేకుండా పోయింది.
గల్లంతు అయిన వారిలో మధు, గోపి, బన్నీ, వీరబాబు మరో వ్యక్తి ఉన్నారు. ఐదుగురు వ్యక్తులు గల్లతవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ వారిని ఎలాగైనా కాపాడలని అధికారులను వేడు కుంటున్నారు. రెస్క్యూ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినట్లు సమాచారం.మరో వైపు తిరు మలాయపాలెం మండలంలో రాకాసి చెరువు వరద పోటెత్తడంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.