హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో ఐదుగురికి డ్రగ్ పాజిటివ్‌గా తేలినట్టు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఎస్వోటీ, లోకల్ పోలీసులతో కలిసి మంగళవారం తనిఖీలు చేపట్టామని పేర్కొన్నారు. జన సందోహం, రద్దీ కలిగిన ప్రాంతాలతోపాటు నిర్దేశించిన ఏరియాల్లో పరీక్షలు చేసి పాజిటివ్ వచ్చిన వారిని విచారిస్తున్నామని తెలిపారు.