కెరమెరి;కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని పరస్వాడ, కొలాంగూడ గ్రామాలు దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉంటాయి. బైక్ కూడా వెళ్లలేని ఆ ప్రాంతానికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మంగళవారం సాయంత్రం కాలినడకన వెళ్లారు. సుమారు 5 కిలోమీటర్లు దట్టమైన అటవీ ప్రాంతంలో నడిచారు. ఆయా గ్రామాల ప్రజలను కలిసి సమస్యలపై ముచ్చటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అని ఆరా తీశారు. గుట్టలు, రాళ్లు రప్పలతో అధ్వానంగా ఉన్న రహదారి నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.