తుర్కయంజాల్, జూలై 10: రంగారెడ్డి జిల్లా కోహెడ పర్యటనలో పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి మ త్స్యకారుల నుంచి నిరసన సెగ తగిలింది. కాంగ్రెస్ సర్కార్ తమకు తీరని ద్రోహం చేస్తున్నదని మత్స్యకారులు మండిపడ్డారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలతో మం త్రి ఎదుటే ఆందోళనకు దిగారు. ఆదిబట్ల సర్కిల్ తొర్రూర్ డివిజన్ పరిధిలోని కోహెడలో రూ.47.03 కోట్ల వ్యయంతో ఎగుమతి-దిగుమతి ఆధారిత హోల్‌సేల్ చేప ల మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చే సేందుకు వచ్చిన మంత్రి శ్రీహరికి ఈ చే దు అనుభవం ఎదురైంది.
శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి ప్రసంగం మొదలు పెట్టగానే మత్స్యకారులు ప్లకార్డులు పట్టుకొని నాదాలు చేశారు. సభావేదిక వద్దకు ఆందోళనకారులు వస్తుండగా పోలీసులు వారిని అరెస్ట్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహ, ఇతర మత్స్యకారులు మాట్లాడారు. కేసీఆర్ హయాం లో ఏటా మత్స్యకారులకు రాష్ట్రమంతా 100 శాతం చేపపిల్లల పంపిణీ జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేవలం 30 శాతమే చేపపిల్లలను పంపిణీ చేస్తున్నదని ధ్వజమెత్తారు. నిరుడు బడ్జెట్లో చేపపిల్లల పంపిణీ కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.123 కోట్ల బడ్జెట్‌ను పూర్తిస్థాయిలో వినియోగించకపోగా, రాష్ట్రవ్యాప్తంగా కేవలం 30శాతం మాత్రమే చేపపిల్లలను ప్రభుత్వం పంపిణీ చేసిందని తెలిపారు. అవికూడా నాణ్యతగా లేకపోవడంతో సరైన బరువు పెరుగలేదని, దీం తో తీవ్రనష్టాలను చవిచూడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు.
రైతుభరోసా పథకం కింద రైతులకు నగదు సాయం అందించినట్టుగానే చేపపిల్లల కొనుగోలు కోసం నేరుగా మత్స్యకారుల సొసైటీ ఖాతాల్లో నగదు జమ చేయాలని మత్స్యకారులు డిమాండ్ చేశా రు. మృతుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మత్స్యకారుల బీమా ప్రీమియాన్ని సర్కార్ చెల్లించకపోవడంతో మరణించిన ఎందరో మత్స్యకారుల కుటుంబాలకు బీమా క్లెయిమ్‌లు రాక ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఆ యా డిమాండ్లను రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు, సంబంధిత శాఖ మంత్రికి తెలిపినా ఎలాంటి స్పందన లేకపోవడంతోనే తాము మంత్రి సభలో నిరసన తెలిపినట్టు వారు తెలిపారు. పోలీసులు అరెస్ట చేసిన వారిలో మత్స్యకారుల సంఘం ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, కార్యదర్శి ఇస్తారి తదితరులు ఉన్నారు.
కోహెడలో నిర్మించనున్న అంతర్జాతీ య మంచినీటి చేపల ఎగుమతుల కేం ద్రం సముద్రతీరం కాకుండా దేశంలోనే అంతర్గతంగా తొలిసారిగా చేపట్టినట్టు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఆధునిక ఎగుమతుల కేంద్రం ఏర్పాటుకావ డం తెలంగాణకు గర్వకారణం అని కొనియాడారు. మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడం, వారికి శాశ్వత ఉపాధి కల్పించడం, అంతర్జాతీయ మారెట్లకు అవకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్టు చెప్పారు. దీనిద్వారా మత్స్యకారులకు మెరుగైన ధరలు అందనున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమం లో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఫిషరీస్ డైరెక్టర్ నిఖిల, గడ్డి అన్నారం మార్కె ట్ చైర్మన్ చిలుకా మధుసూదన్‌రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి పాల్గొన్నారు.