డీఈఈసెట్లో ఉమెరా పర్వీన్‌కు ఫస్ట్ ర్యాంకు
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఈ) సెట్ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలో ఉర్దూ మీడియంలో ఉమెరా పర్వీన్ 78 మార్కులతో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకును సొంతం చేసుకొన్నారు.
- ఉర్దూ మీడియంలో నిజామాబాద్ జిల్లా విద్యార్థినికి ప్రథమస్థానం
- తెలుగు మాధ్యమంలో మురళికి, ఇంగ్లిష్ మీడియంలో ఇర్షాద్ బేగ్‌కు మొదటి ర్యాంకు
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఈ) సెట్ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలో ఉర్దూ మీడియంలో ఉమెరా పర్వీన్ 78 మార్కులతో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకును సొంతం చేసుకొన్నారు. ఉమెరా పర్వీన్.. నిజామాబాద్ జిల్లా, రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందినవారు.
తెలుగు మీడియంలో ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలం రుద్రాపూర్ గ్రామానికి చెందిన మొర్లె మురళి 65 మార్కులతో తొలి ర్యాంకు సాధించారు. ఇంగ్లిష్ మీడియంలో జోగులాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని నల్లకుంటకు చెందిన మీర్జా మహ్మద్ ఇర్షాద్ బేగం 77 మార్కులతో మొదటి ర్యాంకును కైవసం చేసుకొన్నారు. మొత్తం 71శాతానికిపైగా విద్యార్థులు అర్హత సాధించారని డీఈఈ సెట్ కన్వీనర్ శ్రీనివాసాచారి తెలిపారు. ఫలితాల కోసం http://deecet. cdse. telangana.gov. inను సంప్రదించాలని కోరారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

