మకజొన్న సాగుపై దృష్టి పెట్టాలి
మారుతున్న ప్రపంచంలో ఆహారం, దాణా, పశుగ్రాసం, ఇంధనం, సుస్థిరత కోసం ‘మకజొన్న విప్లవం’ అవసరమని పలువురు వక్తలు పేర్కొన్నారు. తొలి అంతర్జాతీయ మకజొన్న సదస్సు సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది.
- డీఏఆర్ఈ కార్యదర్శి డాక్టర్ జాట్ పిలుపు
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : మారుతున్న ప్రపంచంలో ఆహారం, దాణా, పశుగ్రాసం, ఇంధనం, సుస్థిరత కోసం ‘మకజొన్న విప్లవం’ అవసరమని పలువురు వక్తలు పేర్కొన్నారు. తొలి అంతర్జాతీయ మకజొన్న సదస్సు సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. మకజొన్న పరిశోధన, ఉత్పాదకత, విలువ గొలుసు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే వ్యూహాలపై చర్చించేందుకు శాస్త్రవేత్తలు, విధాన రూపకర్తలు, వ్యవసాయ సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు సమావేశంలో చర్చించారు.
సదస్సులో డీఏఆర్ఈ కార్యదర్శి, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం ఎల్ జాట్ మాట్లాడుతూ.. ఇతర ముఖ్యమైన పంటలకు, ప్రత్యేకించి నూనెగింజలు, పప్పుధాన్యాలకు భంగం కలుగకుండా వివిధ పంట కాలాలు, వ్యవసాయ పర్యావరణ మండలాల్లో మకజొన్న సాగుపై వ్యూహాత్మకంగా దృష్టి సారించాలని సూచించారు. సదస్సులో ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్(క్రాప్ సైన్స్) డాక్టర్ డీ కే యాదవ్, మకజొన్న శాస్త్రవేత్త, ప్రపంచ ఆహార పురసార గ్రహీత పద్మశ్రీ డాక్టర్ ఎస్ వాసల్, డీఏఆర్ఈ మాజీ కార్యదర్శి, ఐసీఏఆర్ మాజీ డీజీ, పద్మభూషణ్ డాక్టర్ ఆర్ఎస్ పరోడా తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

