ఆయుర్వేదం వేడి చేస్తుందా?
భారతీయ వైద్యమైన ఆయుర్వేదం ఎన్నో వేల ఏండ్ల నుంచి ఈ దేశంలో వాడుకలో ఉంది. అత్యంత ప్రజాదరణ పొందింది. బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చేవరకు ఇదొక ఘనమైన వైద్యం. భారతీయులంతా ఆయుర్వేద మందులు వాడి తమ రోగాలను తగ్గించుకునేవారు. వైద్యులు తాళపత్రాలలో, ఇంటి పెద్దలు దీనిని గృహవైద్యంగా ఉపయోగించేవారు. కానీ బ్రిటిష్ పాలకులు మన దేశానికి అల్లోపతి వైద్యాన్ని తీసుకువచ్చారు.
భారతీయ వైద్యమైన ఆయుర్వేదం ఎన్నో వేల ఏండ్ల నుంచి ఈ దేశంలో వాడుకలో ఉంది. అత్యంత ప్రజాదరణ పొందింది. బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చేవరకు ఇదొక ఘనమైన వైద్యం. భారతీయులంతా ఆయుర్వేద మందులు వాడి తమ రోగాలను తగ్గించుకునేవారు. వైద్యులు తాళపత్రాలలో, ఇంటి పెద్దలు దీనిని గృహవైద్యంగా ఉపయోగించేవారు. కానీ బ్రిటిష్ పాలకులు మన దేశానికి అల్లోపతి వైద్యాన్ని తీసుకువచ్చారు. వారి సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఇంగ్లిష్ వైద్యాన్ని ప్రజలలోకి తీసుకువచ్చారు. అందుకోసం ఏకంగా పట్టణాలలో మిషనరీ హాస్పిటల్స్‌నే ప్రారంభించారు. వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయుర్వేదానికి ఆదరణ తగ్గకపోవడంతో… రకరకాల కుయుక్తులు పన్నారు. అందులో భాగంగానే.. ఆయుర్వేద మందులు వాడితే వేడి చేస్తాయనే గోబెల్స్ ప్రచారం చేయడం ప్రారంభించారు.
ఆయుర్వేద మందులు వాడితే వేడిచేస్తాయని భావించిన ప్రజలు.. అప్పటినుంచి క్రమంగా ఆయుర్వేద మందుల స్థానంలో అల్లోపతి మందులు వాడటం ప్రారంభించారు. బ్రిటిష్ వాళ్లు ఆ రోజుల్లో ప్రారంభించిన దుష్ప్రచారం ఇప్పటికీ అలానే కొనసాగుతుండటం దురదృష్టకరం. 18వ శతాబ్దం తొలినాళ్లలో ట్రయల్ అండ్ ఎర్రర్ పద్దతిలో అల్లోపతి వైద్యంలో కెమికల్ పొడులు, టించర్లు, వాటికి తాయారు చేసే ద్రావకాలు, చూర్ణాలు లాంటి మందులెన్నో ఇచ్చేవారు. వీళ్లు రసవాదానికి సంబంధించిన పాదరసము, సీసంలాంటి లోహాలను పరిశుభ్ర పరచకుండా చికిత్సలో భాగంగా వాడేవారు. దీనివల్ల విపరీతమైన వేడిచేసి ఒళ్లంతా దద్దుర్లు, మందుల తాలూకు వాసనలు, చెమటలు పట్టడం, కండ్లు తిరగడం, నాడీ తగ్గిపోవడం లాంటి సైడ్ ఎఫెక్ట్లు వచ్చేవి. అయితే శాస్త్రీయ సృ్పహ పెరిగేకొద్ది వాళ్లు కొత్త సింథటిక్ మందులను వెలుగులోకి తెచ్చారు. వాళ్ల ఔషధాల లోపభూయిష్టమైన అంశాలను అప్పటికే అభివృద్ధి చెందిన ఆయుర్వేద ఔషధాలను కించ పరచాలనే దురుద్దేశంతో తకువ చేయడం మొదలుపెట్టారు. లోపభూయిష్టమైన వాళ్ల ఔషధాల పనితీరును, వేడిచేసే తత్వాన్ని ఆయుర్వేదానికి అంటకట్టారు.
ప్రపంచమంతా రెండు వందల ఏండ్ల క్రితం వరకు అందరూ ఆయుర్వేదమే వాడారు. చరిత్ర కారులు కానీ, ట్రావెలాక్స్ రాసిన అన్వేషికులైన మార్కోపాలో, అబ్దుల్ రజాక్, అల్ బెరూని ఫాహియన్, హుయాంగ్ సాంగ్, ప్లీని లాంటి యాత్రికులు భారత్ వచ్చినప్పుడు ఆయుర్వేదమే వాడారు. వీళ్లు ఎవరూ పుస్తకాలలో రాయలేదు. 500 ఏండ్ల నుంచి భారతదేశ సుగంధద్రవ్యాల కోసం పశ్చిమ సముద్రాలపై వచ్చిన యూరోపియన్ వర్తకులు భారతదేశంలో ఆయుర్వేదమే వాడారు. అది అలాగే 18వ శతాబ్దం వరకు నిరాఘాటంగా కొనసాగింది. చివరి మొగల్ చక్రవర్తి భగంధర (ఫిస్టులా) చిదమడం వల్ల పెద్ద సర్జరీ చేసినట్లు, బెంగాల్‌పై కప్పం తీసుకునే హక్కును కంపెనీ పాలకులకు అప్ప చెప్పారు. ఇప్పుడు అప్పుడు ఫిష్టులాకు అద్భుత వైద్యం చేసేవాళ్లు ఆయుర్వేద వైద్యులే.
మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, జాజికాయ, జాపత్రి, లవంగాలు, పిప్పళ్లు, బిరియాని ఆకులు, మరాఠీ మొగ్గ లాంటి మన సుగంధ ద్రవ్యాల కోసం బంగారం ఇచ్చి ఎగపడ్డారు. మనందరికి తెలిసి ఇవన్నీ వేడిచేసే పదార్థాలే కదా. వీటితో తయారైన బిర్యానీలు లొట్టలేసుకుంటూ తింటాం. ఈ పదార్థాల వల్ల యూరోపియన్ ఆహారం పాడవకుండా ఉంటుంది. దీనివల్ల లాభమే తప్ప నష్టం లేదు. మరి ఇలాంటి సుగంధ ద్రవ్యాలలోని కొన్ని పదార్థాలు ఆయుర్వేద ఔషధాలలో తకువ మోతాదులో వాటడం జరుగుతుంది. శీతాఫలాది చూర్ణం, తలీసాది చూర్ణం, అగస్త్య రసాయనం, పిప్పరి ఆసవం లాంటి ఔషధాలు జలుబు, ఎలర్జీలు, ఆయాసం, తుమ్ములు ఇతరత్రా శ్వాసకోశ వ్యాధులలో వాడతారు. ఇవన్నీ చాలా తీక్షణంగా, అద్భుతంగా పనిచేస్తాయి. ఎక్కువగా వేడిచేసిన దాఖలాలు ఎన్నడూ లేవు.
కొండదొరల వైద్యాలు, పసరు వైద్యాలు, వట్టికారం అన్నంతో వెల్లుల్లి ముద్దలు తినిపించే నాటు వైద్యాలు ఆయుర్వేద వైద్యం కాదు. ఆయుర్వేద వైద్యం అంటే చదువుకొని అనుభవం సంపాదించి, శాస్త్రీయ పద్ధతిలో ప్రాక్టీస్ చేసే ఒక అద్భుతమైన వైద్యశాస్త్రం. అనేకానేక దుష్ప్రచారాలు నమ్మడం వల్ల ప్రజలు మంచి ఆయుర్వేద వైద్యాన్ని పొందలేకపోతున్నారు. ఇప్పటికైనా నిజానిజాలు తెలుసుకుంటే మేలు. దీనివల్ల ఇప్పుడు అనుభవిస్తున్న ఎన్నో దీర్ఘకాలిక రోగాలు అత్యంత చౌకగా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి వైద్యం పొందవచ్చు.
డాక్టర్ బుక్కా మహేశ్‌బాబు
ఆయుర్వేద వైద్య నిపుణులు
70328 03085
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

