చార్జీలు ఎక్కువుంటే విమానంలో వెళ్లొద్దు
విమాన చార్జీల పెరుగుదలకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. విమాన చార్జీలు 700 శాతం వరకు పెరిగాయన్న పిటిషనర్ వాదనపై స్పందించిన న్యాయస్థానం విమానంలో ప్రయాణించకండి. వేరే మార్గం చూసుకోండి అని వ్యాఖ్యానించింది.
- టికెట్ ధరలు 700% పెరిగాయన్న
- పిటిషన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, నవంబర్ 2: విమాన చార్జీల పెరుగుదలకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) విచారించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. విమాన చార్జీలు 700 శాతం వరకు పెరిగాయన్న పిటిషనర్ వాదనపై స్పందించిన న్యాయస్థానం విమానంలో ప్రయాణించకండి. వేరే మార్గం చూసుకోండి అని వ్యాఖ్యానించింది. విమాన చార్జీలు 700% వరకు పెరిగాయని జస్టిస్ జే విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట పిటిషినర్ తరఫు న్యాయవాది వాదించారు. విమాన ప్రయాణం ఒక అత్యవసర సేవ అని, టికెట్ ధరలను ఇంత భారీగా పెంచడం రాజ్యాంగంలోని 14వ అధికరణాన్ని ఉల్లంఘించడమేనని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వాదనలను వినడానికి నిరాకరించిన కోర్టు పిటిషన్ని కొట్టివేసింది.
విమాన చార్జీల పెంపు ఇలా&
2025లో విమాన ధరల గురించి ఫిర్యాదులు తెరపైకి వచ్చాయి. మహా కుంభమేళా, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అనేక మార్గాల్లో టికెట్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇది విమానయాన సంస్థల ధరల విధానాలపై ప్రశ్నలకు దారితీసింది. మహా కుంభమేళా, పండుగలు, ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితులు వంటి సమయాల్లో ప్రజలకు విమాన ప్రయాణం అత్యంత అవసరమైనప్పుడు, విమానయాన సంస్థలు చార్జీలను ఎందుకు అనేక రెట్లు పెంచుతున్నాయని విమర్శకులు ప్రశ్నించారు. సామాజిక కార్యకర్త ఎస్ లక్ష్మీనారాయణన్ 2025లో విమాన ధరలను పర్యవేక్షించేందుకు నియంత్రిత సంస్థ ఉండాలని కోరుతూ పిల్ దాఖలు చేశారు.
అసాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వ జోక్యం
- విమాన చార్జీలపై కొత్త నిబంధనలు జారీ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అసాధారణ పరిస్థితుల్లో విమాన టికెట్ల ధరల విషయంలో జోక్యం చేసుకొనే అధికారాన్ని పొందుతూ కొత్త నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సోమవారం నోటిఫై చేసింది. పెరిగిన ముడి చమురు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ధరల కారణంగా విమాన చార్జీలు పెరుగుతాయన్న ఆందోళనల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర పౌర విమానయాన మం త్రిత్వ శాఖ నోటిఫై చేసిన భారతీయ వాయుయాన్ నియమ్ 2026 ప్రకారం అ సాధారణ పరిస్థితుల్లో జోక్యం చేసుకోవడం అవసరమని భావిస్తే విమాన ధరల విషయంలో విమానయాన సంస్థలకు ప్రభు త్వం ఆదేశాలు జారీ చేయవచ్చు. చట్ట ప్రకా రం అటువంటి ఆదేశాలు పరిస్థితికి అనుగుణంగా ఉంటాయి. నిర్ణీత కాలం వరకు మాత్రమే అమల్లో ఉంటాయి.
నిబంధన 192 ప్రకారం షెడ్యూల్డ్ విమాన సేవలను నిర్వహించే విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చులు వంటి అంశాల ఆధారంగా చార్జీలను నిర్ణయించి, టారిఫ్ వివరాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు సమర్పించాల్సి ఉంటుంది. అసాధారణ పరిస్థితులు తలెత్తాయని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జోక్యం చేసుకోవడం అవసరమని భావించిన పక్షంలో కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక ఆదేశాలను జారీ చేయడానికి ఈ నిబంధన అవకాశం కల్పిస్తుంది. కొత్త నిబంధనలు విమాన చార్జీల ధరల విషయంలో మరింత పారదర్శకతను కూడా తప్పనిసరి చేస్తాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

