హైదరాబాద్, జనవరి 20 (నమస్తేతెలంగాణ) : విద్యార్థి దశలోనే సాంకేతిక, సామాజిక, ఆర్థిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా సోమవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తొలి చిల్డ్రన్ ట్రాఫిక్ పార్క్‌ను రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. రోడ్ సేఫ్టీ విషయంలో ప్రతి ఒకరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ అవేర్నెస్ పారులు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, రవాణాశాఖ కమిషనర్ సురేంద్రమోహన్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, జాయింట్ కమిషనర్ రమేశ్, చంద్రశేఖర్‌గౌడ్, శివలింగయ్య, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, డాక్టర్ పుప్పాల శ్రీనివాస్ పాల్గొన్నారు.