ఆదివారం 17 జనవరి 2021
Telangana - Jan 04, 2021 , 02:56:12

రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌లో మంటలు

రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఇంజిన్‌లో మంటలు

హైదరాబాద్‌, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ నుంచి బెంగళూర్‌ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజిన్‌లో ఆదివారం రాత్రి మంటలు చెలరేగాయి. వికారాబాద్‌ జిల్లా తాండూరు సమీపంలోని నవాంద్గి స్టేషన్‌ సమీపానికి రాగానే ఇంజిన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు వచ్చాయి. పొగ, మంటలను గమనించిన రైల్వే సిబ్బం ది వెంటనే స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. ప్రయాణికుల బోగీలను ఇంజిన్‌ నుంచి వేరుచేసినట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేసినట్టు తెలిపారు. మరో లోకో ఇంజిన్‌ను తెప్పించి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను పంపించినట్టు వెల్లడించారు. రైలు బోగీలకు, ప్రయాణికులకు ఎలాంటి నష్టం, ప్రమాదం వాటిల్లలేదని వెల్లడించారు.