డెక్కన్ స్పోర్ట్స్ భవనంలో అదుపులోకి వచ్చిన మంటలు
fire under control | సికింద్రాబాద్ పరిధి రాంగోపాల్‌పేటలోని ఆరంతస్తుల డెక్కన్ స్పోర్ట్స్ భవనంలో ఇవాళ ఉదయం భారీగా మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది ఎట్టకేలకు మంటలను
హైదరాబాద్ : సికింద్రాబాద్ పరిధి రాంగోపాల్‌పేటలోని ఆరంతస్తుల డెక్కన్ స్పోర్ట్స్ భవనంలో ఇవాళ ఉదయం భారీగా మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకువుచ్చారు. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి.. భవనం మొత్తం అంటుకున్నాయి. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్లను మోహరించి.. అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అలాగే భవనంలో చిక్కుకుపోయిన ఐదుగురిని కాపాడారు. ఘటనపై రాంగోపాల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ ప్రాంతీయ అధికారి పాపయ్య మాట్లాడుతూ మంటలను ఆర్పేందుకు 22 ఫైర్ ఇంజిన్లను వాడినట్లు వివరించారు. చరిత్రలో తొలిసారిగా 22 ఫైరింజన్లను వినియోగించడం ఇదే తొలిసారి అని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్‌లో 90 మంది సిబ్బంది పాల్గొన్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. శుక్రవారం డెక్కన్ స్పోర్ట్స్ భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించనున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు భవన పటిష్టతను పరిశీలించనున్న పరిశీలిస్తారు. భారీ అగ్నిప్రమాదం నేపథ్యంలో చుట్టుపక్కల ఇండ్లకు సైతం మంటలు వ్యాపించాయి. దీంతో అధికారులు భవనానికి సమీపంలో ఉన్న ప్రజలను సైతం అధికారులు శిబిరాలకు తరలించారు. శిబిరాల్లోనే వారికి జీహెచ్ఎంసీ అధికారులు భోజన వసతి కల్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

