హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 96 ప్రాంతాల్లో అగ్నిమాపకశాఖ తనిఖీలు చేపట్టి, మాక్ డ్రిల్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించినట్టు ఆ శాఖ ఏడీజీ వై నాగిరెడ్డి శుక్రవారం తెలిపారు. వారం రోజుల్లో దవాఖానలు, పెట్రోల్ బంక్‌లు, అపార్ట్మెంట్లు, నివాస సముదాయాలు, వాణిజ్య భవనాలు, పాఠశాలలు, కళాశాలలు, మల్టీఫ్లెక్స్, మాల్స్, బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చినట్టు వివరించారు. వివిధ జిల్లాల్లో 16 బోట్లతో రెస్యూ టీమ్‌లు ప్రాక్టీస్ యథావిధిగా కొనసాగించాయని నాగిరెడ్డి వెల్లడించారు.