కరీంనగర్ తెలంగాణచౌక్, జూన్ 28 : కరీంనగర్ డిపో-2 లో ఆర్టీసీ ఒప్పందంతో ప్రైవేట్ సంస్థ జేబీఎం (జై భారత్ మారుతి) నడిపిస్తున్న ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీ నుంచి మంటలు వెలుబడ్డాయి. శనివారం ఉదయం 5.30 గంటలకు ఎలక్ట్రిక్ బస్సు హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా, డ్రైవర్ బస్టాండ్‌లోని ఫ్లాట్‌ఫాం మీదకు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు.
ఈ సమయంలో బస్సు కింద ఉండే బ్యాటరీల నుంచి మంటలు రాగా ఆందోళన చెందిన డ్రైవర్.. ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది.