Fire Accident | కాటేదాన్‌లో భారీ అగ్నిప్రమాదం
Fire Accident | రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక హగ్గీస్ పరిశ్రమలు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా మంటలు అంటుకొని అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి.
Fire Accident | రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక హగ్గీస్ పరిశ్రమలు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా మంటలు అంటుకొని అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. పరిశ్రమలో మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున దట్టమైన పొగ పరిసర ప్రాంతాల్లో వ్యాపించింది. భారీగా వస్తున్న పొగ కారణంగా స్థానికులు ఊపిరిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనకు సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

