Fire Accident | తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్లోపల ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారత్ మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో భారత మాతకు మహా హారతి అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు పటాకులు కాల్చడంతో హుస్సేన్ సాగర్‌లోని రెండు బోట్లకు నిప్పంటుకుంది.
ఒక్కసారిగా ఒక్కసారిగా వ్యాపించిన మంటలతో బోట్లు కాలి బూడిదయ్యాయి. దీంతో పడవల్లో ఉన్న పలువురికి గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగినప్పుడు బోట్లలో ఉన్న 15 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో గాయపడిన డీ సునీల్ (35), ప్రణీత్ (32) సికింద్రాబాద్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు.