ఆలేరు టౌన్, డిసెంబర్ 14 : యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు శ్రీమల్లికార్జున స్వామి కాటన్ ఇండస్ట్రీలో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. షెడ్లలో ఉన్న 300 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. మరికొంత పత్తి పొగ చూరడంతో పనికి రాకుండాపోయింది.
ఆలేరు అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్తో వచ్చి మంటలను ఆర్పేశారు. పత్తిని నిల్వ చేసిన షెడ్లో విద్యుత్ షార్ట్ సర్యూట్ కారణంగా నిప్పు రవ్వలు వచ్చి పత్తి కుప్పలపై పడడంతో ప్రమాదం జరిగిందని మిల్లు యాజమాన్యం పేర్కొందిది. రూ.30లక్షల నష్టం వాటిల్లినట్టు వాపోయింది.