హైదరాబాద్, అక్టోబర్ 14(నమస్తేతెలంగాణ) : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పీఆర్టీయూటీఎస్ అభ్యర్థులను ఖరారు చేసింది. వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గం నుంచి పింగిలి శ్రీపాల్‌రెడ్డి, కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ స్థానం నుంచి వంగ మహేందర్‌రెడ్డిని బరిలోకి దించనున్నది. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో వీరి అభ్యర్థిత్వాలను అధికారికంగా నిర్ణయించినట్టు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డి వెల్లడించారు.