హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : సినీ నిర్మాత కేపీ చౌదరి (అలియాస్ కృష్ణప్రసాద్) గోవాలో ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళ చిత్రం కబాలీని తెలుగులో రిలీజ్ చేసిన ఆయన ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత గోవా వెళ్లి అక్కడే ఓ క్లబ్‌ను నడుపుతూ స్థిరపడ్డాడు. క్లబ్ కూడా సరిగా నడవకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురై ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తున్నది.