Naga Chaitanya | హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ) : మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సినీ నటుడు నాగచైతన్య ఖండించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. మంత్రి వ్యాఖ్యలు అసత్యమని, అవి హాస్యాస్పదం, ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. మహిళలకు మద్దతునిచ్చి, వారిని గౌరవించాలని అన్నారు. సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం తగదని పేర్కొన్నారు.