హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు 27,075 సీట్లను భర్తీ చేశారు. ఎంబీఏలో 22,679 సీట్లు, ఎంసీఏలో 4,396 సీట్లు నిండాయి. రాష్ట్రంలో మొత్తం 32,299 సీట్లుండగా, ఇంకా 5,224 సీట్లు మిగిలాయి. ఈ నెల 20 నుంచి 29 వరకు https://tsicet.nic.in ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లింపు, కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చు. సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 30, 31న ఆయా కాలేజీల్లో ప్రత్యక్షంగా రిపోర్టింగ్ చేయాలి.