హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : టీజీట్రాన్స్కోలో ఖాళీగా ఉన్న 1,300 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను వెంటనే భర్తీచేయాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్(టీఎస్ఈఏఈఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్‌కో సర్కిల్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల పవన్ మాట్లాడుతూ.. ట్రాన్స్‌కోలో ఇంజినీర్ల కొరత వేధిస్తున్నదని పేర్కొన్నారు. 2018 త ర్వాత నియామకాలు ఆగిపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. తక్షణమే ఏఈ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
టీజీపీఎస్సీకి కొత్త సభ్యులు ; ముగ్గురిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : ఖాళీలతో కుదేలవుతున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ)కు ముగ్గురు కొత్త సభ్యులు వచ్చారు. సీ చంద్రకాంత్‌రెడ్డి, విశ్వప్రసాద్, ప్రొఫెసర్ ఎల్ లక్ష్మీకాంత్రాథోడ్లను సభ్యులుగా ప్రభు త్వం నియమించింది. అయితే, ఐజీ కేడర్ ఐపీఎస్ అధికారి అయిన విశ్వప్రసాద్‌ను కమిషన్ సభ్యుడిగా నియమించడం గమనార్హం. ప్రొఫెసర్ రా థోడ్ గతంలో పాలమూరు విశ్వవిద్యాలయం వీసీగా పనిచేశారు. చంద్రకాంత్‌రెడ్డి ఇప్పటివరకు జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్‌గా ఉన్నారు. టీజీపీఎస్సీలో పది మంది సభ్యులు ఉం డాల్సి ఉండగా, గతంలో నియమించిన పాల్వాయి రజినికుమారి, ప్రొఫెసర్ నర్రి యాదయ్య, అమీరుల్లా ఖా న్‌తో కలిపి మొత్తం ఆరుగురిని నియమించినైట్టెంది.