హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : విద్యుత్తు సంస్థల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టులను భర్తీచేయాలని తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు ఇంధనశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. అనంతరం ప్రొఫెసర్ కోదండరాంను కలిసి అసోసియేషన్ అధ్యక్షుడు జీ పవన్‌కుమార్, ప్రధాన కార్యదర్శి టీ మహేశ్ తదితరులు చర్చలు జరిపారు.