Warangal | కాశీబుగ్గ, జూన్ 1: బిర్యానీ సెంటర్లో రూపాయి విషయమై ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఒకరి హత్యకు దారితీసింది. ఈ ఘటన గ్రేటర్ వరంగల్‌లోని 18వ డివిజన్ నర్సంపేట్ రోడ్డు నుంచి ఏనుమాములకు వచ్చే వంద ఫీట్ల రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగింది. 15వ డివిజన్ గరీబ్‌నగర్ ఆటో డ్రైవర్ ఇసంపెల్లి ప్రేమ్‌సాగర్ (45) వందఫీట్ల రోడ్డులోని నబి బిర్యానీ సెంటర్లో బిర్యానీ కొనుగోలు చేశాడు.
బిర్యానీ ధర రూ.59 కాగా ఫోన్ పే ద్వారా రూ.60 పంపి రూపాయి ఇవ్వాలని యజమానిని అడిగాడు. రూపాయి చిల్లర లేదని చెప్పగా.. ఇంతలో గాంధీనగర్‌కు చెందిన ఆటో డ్రైవ ర్, కాంగ్రెస్ నాయకుడు జన్ను అరవింద్ వచ్చి.. ‘రూపాయి ఎందుకు ఎక్కువ కొట్టా వు.. చిల్లర లేదని చెప్పినంక ఘర్షణ ఎందు కు’ అని నిలదీశాడు. దీంతో అరవింద్, ప్రేమ్‌సాగర్ మధ్య మాటామాటా పెరిగి అరవింద్.. ప్రేమ్‌సాగర్‌ను నెట్టడంతో మెట్లపై పడిపోయాడు. తలకు తీవ్రగాయమై మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.