బయోచార్తో భూసారం వృద్ధి
పంట వ్యర్థాలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఇక్రిశాట్ కృషి చేస్తున్నది. అందులో భాగంగా వాటితో సహజ సిద్ధమైన ఎరువు (బయోచార్)ను తయారు చేసి భూసారాన్ని పెంపొందించే విధానాన్ని అభివృద్ధి చేసింది.
- వ్యవసాయ వ్యర్థాలతో ఎరువు తయారీ
- రైతులకు అవగాహన కల్పిస్తున్న ఇక్రిశాట్
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): పంట వ్యర్థాలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఇక్రిశాట్ కృషి చేస్తున్నది. అందులో భాగంగా వాటితో సహజ సిద్ధమైన ఎరువు (బయోచార్)ను తయారు చేసి భూసారాన్ని పెంపొందించే విధానాన్ని అభివృద్ధి చేసింది. పంట వ్యర్థాలను బహిరంగంగా దహనం చేయడానికి బదులుగా వాటిని ప్రత్యే ఉష్ణోగ్రత వద్ద భూమి లోపలే కాల్చడం వల్ల వచ్చే పదార్థాన్ని బయోచార్ అంటారు.
ఈ విధానంతో భూసారం పెరగడంతోపాటు పంట వ్యర్థాలు, నీటి కాలుష్యం గణనీయంగా తగ్గిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బయోచార్ తయారీపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 500 మిలియన్ టన్నుల పంట వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్టు 2017లో ఓ అధ్యయనం వెల్లడించింది.
ఇవి ఏటేటా 10-15 శాతం పెరుగుతున్నట్టు పేర్కొన్నది. దీంతో వాతావరణంలో కార్బన్, గ్రీన్హౌస్ వాయువుల పరిమాణం నానాటికీ అధికమవుతున్నది. ఈ నేపథ్యంలో బయోచార్ తయారీని ప్రోత్సహిస్తే వ్యవసాయ వ్యర్థాలు తగ్గడంతోపాటు రైతులకు అదనపు ఆదాయం కూడా సమకురుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

