బాసర, ఫిబ్రవరి 22: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటుచేసుకొన్నది. ప్రాణంగా ప్రేమించిన బావ మృతిని తట్టుకోలేక పీయూసీ వన్ చదువుతున్న శిరీష (17) అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకొన్నది.
సంగారెడ్డి జిల్లా మనూరు మండలం దాబూరుకు చెందిన శిరీష.. బుధవారమే ఇంటి నుంచి హాస్టల్కు వచ్చింది. గురువారం రాత్రి సూసైడ్ నోట్ రాసి, గదిలో ఉరేసుకొన్నది. మృతదేహాన్ని నిర్మల్ ప్రభుత్వ దవాఖానకు తరలించినట్టు అధికారులు తెలిపారు.