గిర్మాజీపేట, ఏప్రిల్ 21: తోటి ఉ ద్యోగి వేధింపులతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్‌లోని మట్టెవాడలో జరిగింది. మట్ట్టెవాడ బొడ్రాయికి చెందిన ఇరుకుల్ల నాగరాజు భార్య సంగీత(33) జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని మహిళా పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నది. సోమవారం సీఎం సభ బందోబస్తుకు వెళ్లి విధులు ముగించుకొని మంగళవారం మట్టె వాడకు వచ్చి ఉరేసుకున్నది. తోటి ఉద్యోగి శ్రీధర్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకు న్నట్టు సూసైడ్ నోట్ దొరికింది.