లక్ష్మీదేవిపల్లి, ఫిబ్రవరి 7 : లంచం తీసుకున్న కేసు విషయంలో తప్పించుకొని తిరుగుతున్న ఫారెస్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) కొత్తగూడెం డివిజినల్ మేనేజర్ తాటి శ్రావణిని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఏసీబీ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. జనవరి 3న జామాయిల్ తోటల హార్వెస్టింగ్ పనులకు సంబంధించి లంచం డిమాండ్ చేసిన కేసులో ప్లాంట్ మేనేజర్ రాజేందర్, అతడికి సహకరించిన గోపాలకృష్ణను ఏసీబీ అధికారులు భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో అరెస్ట్ చేశారు.