ఎల్బీనగర్, సెప్టెంబర్ 16 : అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని, నోటిఫికేషన్ వచ్చేవరకూ తన ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షుడు పాలకూరి అశోక్రుమార్ స్పష్టంచేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మంగళవారం రెండోరోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా.. ప్రభుత్వం నిరుద్యోగులను విస్మరిస్తూ కాలయాపన చేస్తున్నదని మండిపడ్డారు.