మాడ్గులపల్లి, సెప్టెంబర్ 21: డీ-37 కాల్వ చివరి భూముల సాగునీరందడం లేదని ఆరోపిస్తూ నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలోని గోపాలపురం, కన్నెకల్, మాచినపల్లి, కేశవాపురం గ్రామాల రైతులు శనివారం కాల్వలోకి దిగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. డీ-37 కాల్వ నిర్మాణం కోసం అనేక మంది రైతులు తమ భూములను త్యాగం చేశారని, కాల్వ తవ్విన తర్వాత చివరి భూములకు నీరందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
మాడ్గులపల్లి మండలంలో డీ-37 కాల్వ 27 కిలోమీటర్ల మేర ఉండగా దీని ద్వారా 42 వేల ఎకరాలకు సాగునీరందించాలని, 19 చెరువులను నింపాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్దేశించిందని పేర్కొన్నారు. కానీ.. ప్రస్తుతం కాల్వ ద్వారా విడుదలవుతున్న కొద్దిపాటి నీటిని మొదట ఉన్న రైతులకే సరిపోతున్నాయని, చివరి భూములకు నీరందక సాగు చేసిన పంటలు, తోటలు ఎండిపోయే స్థితికి చేరాయని పేర్కొన్నారు. నీటి విడుదలను పెంచి చివరి రైతులను ఆదుకోవాలని కోరారు.