Transformer | అచ్చంపేట రూరల్, నవంబర్ 13: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సింగారంనకు చెందిన రైతు రాత్లావత్ శక్రునాయక్కు రెండెకరాల పొలం ఉన్నది. మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని నాలుగెకరాల్లో వేరుశనగ పంట సాగు చేశాడు. లోవోల్టేజీతో మోటర్ నడవడం లేదని లైన్‌మన్ శంకర్‌కు సమాచారం అందించాడు. ఆయన జూనియర్ లైన్‌మన్ సీతారాంను పంపించగా.. సమస్య పరిష్కరించలేదు. దీంతో సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఏబీ స్విచ్ ఆఫ్ చేసి తాళం వేశాడు. తాళం వేసి 24 గంటలు గడిచినా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ పరిధిలోని 70 ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది.