మాగనూరు, జనవరి 11: లోవోల్టేజీ సమస్యతో బోర్లు కాలిపోతున్నాయంటూ నారాయణపేట జిల్లా రైతులు ఆందోళనకు దిగారు. 3 నెలలుగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని కొ ల్పూరు, మందిపల్లి, పుంజనూరు, మూడుమాల్, గజ్రందొడ్డి గ్రామాల రైతులు శనివారం కొల్పూర్ సబ్స్టేషన్లో లైన్మన్తో వాగ్వాదానికి దిగారు. సమస్య చెప్పినా స్పందనే లేదంటూ నిరసన తెలిపారు.