దుబ్బాక, జనవరి 18 : సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖకు రై తుల నిరసన సెగ తగిలింది. రుణమాఫీపై కాం గ్రెస్ సర్కార్ మాట తప్పిందని ఆందోళనకు ది గారు. శనివారం దుబ్బాక నియోజక వర్గంలోని అక్బర్పేట-భూంపల్లి మండల కేంద్రంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు దేవాదాయ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖను రుణమాఫీపై రైతులు నిలదీశారు. మంత్రి సరైన సమాధానం ఇవ్వకపోవడంతో రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు, రుణమాఫీ పేరిట రైతులను మోసగించిందని రోడ్డుపై బైఠాయించారు. సీఎం రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్ అంటూ పెద్దపెట్టున నినదించారు. అదేవిధంగా అక్బర్పేట-భూంపల్లిలో ఆరోగ్యకేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డితోపాటు మరికొందరు నాయకులను అనుమతించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ నాయకులను ఎలా అనుమతించారని పోలీసుల ను ప్రశ్నించారు. ప్రోటోకాల్ పాటించడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు.
సంక్షేమ పథకాలు అందడం లేదు ; కొండా సురేఖ ఎదుట వాపోయిన కాంగ్రెస్ నాయకులు
తమ గ్రామానికి సంపూర్ణంగా ప్రభుత్వ పథకాలు అందడం లేదని మంత్రి కొండా సురేఖ ఎదుట కాంగ్రెస్ నాయకులు వాపోయారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లిలో శనివారం సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. గ్రామ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. తమ గ్రామంలో ఇప్పటివరకు రుణమాఫీ పూర్తి గా అమలు కాలేదని తెలిపారు. తమ గ్రామానికి కేవలం 60 రేషన్ కార్డులు మాత్రమే మంజూరయ్యాయని, ఇంకా చాలా రేషన్ కార్డులు అవసరమని సూచించారు.