ఫార్మా భూముల్లో మరో ప్రాజెక్టు!
ఫార్మాసిటీ కోసం గత బీఆర్ఎస్ సర్కార్ సేకరించిన భూములను రేవంత్ సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాజెక్టులకు కేటాయించడంపై రైతులకు ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తాజాగా సోమవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్ద అనుబంధ గ్రామమైన మర్లకుంటతండాలో ఫార్మాతో సంబంధం లేని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుకు సోమవారం శంకుస్థాపన చేయనుండటం విమర్శలకు తావిస్తున్నది.
- నేడు కుర్మిద్దలో ఎన్ఐఏఎంకు సీఎం రేవంత్ శంకుస్థాపన
- ఫార్మాతో సంబంధం లేని వాటికి భూములు కేటాయించడంపై అన్నదాతల్లో ఆగ్రహావేశాలు
- గోప్యంగా ముఖ్యమంత్రి పర్యటన
రంగారెడ్డి, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఫార్మాసిటీ కోసం గత బీఆర్ఎస్ సర్కార్ సేకరించిన భూములను రేవంత్ సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాజెక్టులకు కేటాయించడంపై రైతులకు ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తాజాగా సోమవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్ద అనుబంధ గ్రామమైన మర్లకుంటతండాలో ఫార్మాతో సంబంధం లేని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుకు సోమవారం శంకుస్థాపన చేయనుండటం విమర్శలకు తావిస్తున్నది.
అలాగే ఇబ్రహీంపట్నం సమీపంలోని ఆక్టోపస్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన ఫ్యూచర్‌సిటీ కమిషనర్రేట్ను ప్రారంభించనున్నారు. ఫార్మాసిటీని రద్దు చేసి, ఆ భూములను తిరిగి రైతులకే ఇస్తామని మ్యానిఫెస్టోలో చెప్పి, అధికారంలోకి రాగానే రేవంత్ ఆ హామీని తొక్కారు. భూముల విషయమై రైతులు హైకోర్టుకు వెళ్లడంతో ఫార్మా అనుబంధ కంపెనీలు మాత్రమే ఏర్పాటుచేస్తామని కోర్టుకు అఫిడవిట్ ఇచ్చి మరీ.. బయట మాత్రం ఫార్మాసిటీ రద్దు అంటూ ఫ్యూచర్‌సిటీకి తెరతీయడం రైతులను కలవరపెడుతున్నది.
ఒకవేళ ఫార్మాసిటీ రద్దు చేస్తే బహిర్గతం చేయాలని, కోర్టుకు కూడా అదే విషయం స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైతుల పట్టా భూములను బలవంతంగా తీసుకోవద్దని కోర్టు స్టే ఉన్నప్పటికీ ప్రభుత్వం పోలీసు బలగాలను మోహరించి గుంజుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను వాటికే వినియోగించాలని, కాదని ఇతర కంపెనీలకు కేటాయిస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని పలుమార్లు ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. అంతేగాక తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఫ్యూచర్‌సిటీని రద్దు చేస్తామని స్పష్టంచేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఫార్మాకు సంబంధం లేని ప్రాజెక్టుకు కట్టబెడుతున్నది.
అత్యంత గోప్యంగా సీఎం పర్యటన..
కుర్మిద్ద సమీపంలో కొత్త ప్రాజెక్టు శంకుస్థాపనలో భాగంగా సీఎం పర్యటించే విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికే పలుమార్లు కార్యక్రమం వాయిదా పడిం ది. సోమవారం ఖరారైంది. ముందుగానే ప్రకటిస్తే ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నిరసనలకు దిగుతుందని భావించి, రహస్యంగా ఉంచినట్టు తెలుస్తున్నది. సీఎం ఎప్పుడు వస్తారో తెలియకుండా సీక్రెట్‌గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కాగా, ఫార్మాసిటీ జీవోను రద్దు చేసి తమ భూములను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

