మెట్పల్లి రూరల్, డిసెంబర్ 29: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన రైతులు ఏకమొత్తంలో ఒకేరోజు వ్యవసాయ విద్యుత్తు సర్వీస్ చార్జీలు చెల్లించారు. ఏడేండ్లుగా ఇలా చెల్లిస్తూ మిగతా గ్రామాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
గురువారం స్థానిక ట్రాన్స్ఫార్మర్ కమిటీ ఆధ్వర్యంలో రైతులు ప్రత్యేకంగా సమావేశమై వ్యవసాయ పంపుసెట్ల సర్వీస్ చార్జీ చెల్లించాలని నిర్ణయించారు. 2022 సంవత్సరానికి గాను రూ.360 చొప్పున 1,220 పంపుసెట్లకు చెందిన విద్యుత్తు సర్వీస్ చార్జి రూ.4,39,200 చెల్లించాలని తీర్మానించారు. ఈ మేరకు మెట్పల్లి ట్రాన్స్‌కో డీఈ శ్రీనివాస్, ఏడీ మనోహర్ ఆధ్వర్యంలో రూరల్ ఏఈ రాకేశ్‌కు సంబంధిత మొత్తాన్ని చెల్లించారు.