మహబూబాబాద్ : తెలంగాణ ఏర్పడ్డ తరువాత సాగు, తాగునీటి ఇబ్బందులు పూర్తిగా తొలిగిపోయాయని, కాళేశ్వరం జలాల రాకతో రైతన్నల కండ్లల్లో ఆనందం వ్యక్తమవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు. మహబూబాబాద్(Mahaboobabad) జిల్లా మరిపెడలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ (BRS)ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు.
‘ ఎన్నికల మ్యానిఫెస్టో(Election Manifesto)లో పెట్టని పనులు చాలా చేశాం.కరోనా లేక పోయి ఉంటే మిగతా పనులు కూడా పూర్తి చేసేవాళ్లమని’ పేర్కొన్నారు.గతంలో నీళ్ల కోసం అనేక ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఆ బాధలు లేవని అన్నారు.ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR)దేనని వెల్లడించారు.గత ప్రభుత్వాలు కరెంట్ ఇచ్చిన పాపాన పోలేదు. ప్రస్తుతం 24 గంటల కరెంట్ నిరంతరం వస్తుందన్నారు.
రైతులు పండించిన ప్రతి గింజ కొంటున్నామని తెలిపారు. కార్యకర్తలు,సీనియర్ నాయకులు కలిసి పార్టీని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మలోత్ కవిత, ఎమ్మెల్యే రెడ్డినాయక్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, జడ్పీ చైర్మన్ బిందు, నాయకులు పాల్గొన్నారు.