Urea Shortage | పుట్టెడు ఆశలతో నాట్లు వేసుకున్న రైతులు.. యూరియా చల్లడం అనేది పంట సంరక్షణలో సర్వసాధారణమైన ఓ పనిగా సాగిపోతుంది. కానీ ఇప్పుడు యూరియా దక్కించుకోవడం చాలా పెద్ద శ్రమైపోయింది.
నిత్యం పొలంబాట పట్టాల్సిన రైతులు... తెల్లవారుజాము నుంచే సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బారులు తీరిన రైతుల్లో సగం మందికి కూడా బస్తాలు అందడంలేదు.
పోలీసు బందోబస్తు మధ్య టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న అధికారులు స్టాక్ ఎప్పుడు వస్తుందో చెప్పలేకపోతున్నారు.
అరకొరగా వస్తున్న స్టాక్ కూడా గంటలోనే ఖాళీ అయిపోతున్నది. దీంతో ఎప్పుడు వచ్చినా ఓ సంచీ దక్కించుకోవాలనే ఆరాటంతో అన్నదాతలు ఆరాటపడుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర మంత్రులు పరస్పరం చేసుకుంటున్న విమర్శలతో రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని నిప్పులుచెరిగారు. శుక్రవారం కూడా రైతులు సొసైటీల వద్ద నిద్రకాచి నిరీక్షించారు.
యూరియా కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి సింగిల్ విండో గోదాం వద్దకు భారీగా చేరుకున్న రైతులు
జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు సింగిల్‌విండో కార్యాలయం వద్ద యూరియా కోసం పాసు పుస్తకాలు, ఆధార్‌కార్డు జిరాక్స్ ప్రతులు క్యూలో ఉంచిన రైతులు
సిద్దిపేటలోని మిరిదొడ్డిలో యూరియా ఎక్కడ అని నిలదీస్తున్న రైతు నోరుమూయించే ప్రయత్నం చేస్తున్న పోలీసులు
సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని సహకార సంఘం వద్దకు శుక్రవారం ఉదయం 5గంటలకు యూరియా కోసం భారీగా తరలి వచ్చిన రైతులు
మహబూబాబాద్ పట్టణంలో సొసైటీ కార్యాలయం ఎదుట ఉన్న స్కూల్ ఆవరణలో భోజనం చేస్తున్న రైతులు
శుక్రవారం హన్మకొండ జిల్లాలో యూరియా కోసం కార్యాలయం చుట్టూ క్యూ కట్టిన రైతులు
కామారెడ్డి జిల్లా దోమకొండ వ్యవసాయ సహకార సంఘం ఎదుట వరుసలో పెట్టిన చెప్పులు
వనపర్తి జిల్లా ఆత్మకూరు పీఏసీఎస్ వద్ద యూరియా కోసం పడిగాపులు కాసి ఆగ్రహంతో గన్నీ బ్యాగులకు నిప్పుపెట్టిన రైతులు
తేలుకుట్టి చికిత్సపొందుతూ యూరియా కోసం మహబూబాబాద్ బయ్యారం సహకార సంఘానికి వచ్చిన రైతు కమల
యూరియా కోసం శుక్రవారం తెల్లవారుజామున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నర్సాపురం సహకార సంఘం గోడౌన్ వద్దకు చేరుకున్న రైతులు
మహబూబ్‌నగర్‌లోని మోతీనగర్‌లో క్యూలైనులో నిలబడి ఆలసిపోయిన రైతులు తమ వంతు వచ్చే వరకు కూర్చొన్న దృశ్యం
సంగారెడ్డిలోని చౌటకూరులో ఎరువుల కోసం పాస్‌బుక్‌ను అధికారికి చూపిస్తున్న రైతులు
యూరియా ఇవ్వకపోవడంతో అలిసిపోయి మహబూబాబాద్ పట్టణంలో సొసైటీ కార్యాలయం ఎదుట ఉన్న స్కూల్ ఆవరణలో పడుకున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎరువుల దుకాణం ముందు యూరియా కోసం బారులు తీరిన రైతులు
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి రైతు వేదిక వద్ద యూరియా టోకెన్ల కోసం బారులు తీరిన రైతులు
యూరియా కోసం రైతన్నల ఆందోళన
యూరియా కోసం రైతన్నల ఆందోళన
యూరియా కోసం రైతన్నల ఆందోళన