మాచారెడ్డి, ఏప్రిల్ 19 : కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో ఓ రైతు వడదెబ్బతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన చాకలి మల్లయ్య (48) తనకున్న రెండెకరాల్లో పండించిన ధాన్యాన్ని దర్గా సమీపంలో రెండు రోజులుగా ఆరబోస్తూ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు.
ఆదివారం కూడా ధాన్యం ఆరబోసిన తర్వాత దగ్గరలో ఉన్న ఓ చెట్టు దగ్గరికి వెళ్లి కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానిక వైద్యులు సీపీఆర్ చేసినా స్పందించకపోవడంతో ఆటోలో కామారెడ్డి ఏరియా దవాఖానకు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు.