గూడూరు, అక్టోబర్ 9 : కరెంట్‌షాక్‌తో రైతు మృతి చెం దాడు. ఈ ఘట న మహబూబాబాద్ జిల్లా గూ డూరు మండ లం బొల్లేపల్లి గ్రామ పరిధి వడ్డెరగూడెంలో బుధవారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంపంగి ఐలయ్య (55) పొలానికి నీరు పెట్టేందుకు మోటర్‌ను ఆన్ చేస్తున్న క్రమం లో స్టార్టర్కు విద్యుత్ సరఫరా జరిగి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందా డు. మృతుడికి భార్య నర్సమ్మ, కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.