పొలం దారి ఆక్రమించిన బల్మూరి
‘ఉమ్మడి తొవ్వను ఆక్రమించారు. ఇదేంటని అడిగితే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఆయన సోదరుడు చంపుతామని బెదిరిస్తున్నారు. సీసీ కెమెరాల కనెక్షన్లు కోసివేశారు.
- ఉమ్మడి తొవ్వపై ప్రశ్నిస్తే చంపేస్తమని బెదిరింపులు
- ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఆయన సోదరుడిపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన వృద్ధుడు
జగిత్యాల, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ‘ఉమ్మడి తొవ్వను ఆక్రమించారు. ఇదేంటని అడిగితే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఆయన సోదరుడు చంపుతామని బెదిరిస్తున్నారు. సీసీ కెమెరాల కనెక్షన్లు కోసివేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే మా పరిధిలోని అంశం కాదంటూ తప్పుకొంటున్నారు. మీరే న్యాయం చేయాలి’ అంటూ జగిత్యాల కలెక్టర్, ఎస్పీకి ఎనభై ఏండ్ల వృద్ధుడు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
బాధితుడు బల్మూరి విద్యాసాగర్‌రావు కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాల గ్రామానికి చెందిన బల్మూరి విద్యాసాగర్‌రావుకు సర్వేనంబర్ 236/ఆలో వ్యవసాయ భూమి ఉన్నది. ఈ భూమిలోకి వెళ్లే విషయంలో తన సోదరుడి కొడుకైన బల్మూరి మదన్మోహన్రావుతో 1993లోనే విద్యాసాగర్‌రావు ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు 1999లో పరస్పర అంగీకారంతో ఒప్పంద పత్రం రాసుకున్నారు. ఇరువురి మధ్య 15 అడుగుల దారిని ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ తోవ నుంచి వ్యవసాయ క్షేత్రానికి రాకపోకలు సాగిస్తున్నారు. 33 ఏండ్లుగా ఇది జరుగుతున్నది.
ఇటీవల మదన్మోహన్రావు కొడుకులైన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఆయన సోదరుడు బల్మూరి రాహుల్ ఉమ్మడి తోవను పశ్చిమ భాగంలో ఆక్రమించి, ఇనుప కంచె ఏర్పాటు చేశారని, తోవలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు సంబంధించిన కనెక్షన్లను సైతం తొలగించారని బల్మూరి విద్యాసాగర్‌రావు తెలిపారు. ఈ విషయమై గత నెల 19న మల్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, 112 నంబర్‌కు డయల్ చేసినట్టు చెప్పారు. బల్మూరి వెంకట్ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కావడంతో పోలీసులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
పలుసార్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సమస్యను అధికారులకు వివరించేందుకు ప్రయత్నించినా వారు పట్టించుకోలేదని, సమస్య తమ శాఖ పరిధిలోనిది కాదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. పోలీస్ స్టేషన్‌తోపాటు గ్రామ పంచాయతీలో ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుసుకొన్న బల్మూరి వెంకట్, ఆయన సోదరుడు రాహుల్‌కు తనను బెదిరిస్తున్నారని తెలిపారు. బౌన్సర్లను పంపించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కలెక్టర్, ఎస్పీలు స్పందించి తనకు న్యాయం చేయాలని, ఉమ్మడి తోవ ఆక్రమణను తొలగింపజేయడంతోపాటు ఎమ్మెల్సీ వెంకట్, ఆయన సోదరుడి నుంచి ప్రాణహాని లేకుండా రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ‘ప్రజావాణి’లో విద్యాసాగర్‌రావు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ సెల్‌కు వెళ్లి ఎస్పీకి సైతం ఫిర్యాదు అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

