గంగారం, జూలై 18 : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా దుబ్బగూడెంలో చోటుచేసుకుంది. ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మోటపోతుల సతీశ్(40) కుటుంబంతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. రెండేండ్ల నుంచి మక్క దిగుబడి సరిగా రాక రూ.3 లక్షలు అప్పులయ్యాయి. వ్యవసాయం కలిసిరాక ఫైనాన్స్‌లో ఆటో తీసుకొని నడుపుతున్నాడు. ఆటో కిస్తీ కట్టలేక, వర్షాలు పడక, పంట వేయ, అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాక మానసిక ఒత్తిడికి గురై గురువారం సాయంత్రం చేను వద్ద పురుగులమందు తాగాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని స్థానికులు ఎంజీఎం దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
తోటకు నీరు పెట్టడానికి వెళ్లి..; విద్యుత్తు షాక్‌తో రైతు మృతి
మల్హర్, జూలై 13 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్లకు చెందిన రైతు ఆకుల ఓదెలు (76) విద్యుత్తుషాక్‌తో మృతి చెందాడు. కొయ్యూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓదెలు తనకున్న వ్యవసాయ భూమిలో కూరగాయలు సాగు చేసేవాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం తోటకు నీళ్లు కట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కరెంట్ తీగకు తగలడంతో విద్యుదాఘాతంతో మృతి చెందాడు. అటుగా వెళ్లిన గ్రామస్థులు గమనించి.. ఓదెలు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.