హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆదర్శ రైతు వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించాలని రైతు కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. బుధవారం హైదరాబాద్లోని రైతు కమిషన్ కార్యాలయంలో సమావేశమైన కమిషన్ ఈ మేరకు ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
అనంతరం రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమారకు లేఖలు రాశారు. ఆదర్శ రైతు వ్యవస్థను తిరిగి ప్రారంభించడం ద్వారా రైతులకు ప్రభుత్వ పథకాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మీద ఎలాంటి ఆర్ధిక భారం పడదని స్పష్టంచేశారు. అంతేకాకుండా, సచివాలయంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్రెడ్డి, సీఎంవో సెక్రెటరీ శేషాద్రిని కూడా కలిసి ఆదర్శ రైతు వ్యవస్థ పునరుద్ధరణ ఆవశ్యకతను వివరించారు.