నకిరేకల్, మే 4 : ఓ వైపు ఎండ లు..మరోవైపు లారీల కొరత.. ఇంకో వైపు అకాల వర్షాలతో కాంటా జరుగక, అధికారులు పట్టించుకోక రైతుల ప్రా ణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకున్నది. రైతులు, కుటుంబసభ్యులు తె లిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బాబన్సాహెబ్గూడెంకు చెందిన ఎండీ నజీరుద్దీన్ (68) తనకున్న 3 ఎకరాల తో పాటు 2 ఎకరాలు కౌలుకు తీసుకు ని సాగుచేశాడు. నెల రోజుల క్రితమే తా ను పండించిన ధాన్యాన్ని నెల్లిబండ కొనుగోలు కేంద్రానికి తెచ్చి ఆరబోశా డు.
సమయానికి కాంటా ప్రారంభించకపోవడంతో తన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రోజుల తరబడి ధాన్యం కు ప్పల వద్దే పడిగాపులు కాశాడు. సోమవారం నెల్లిబండ కేంద్రంలో ఉన్న ధా న్యం తడిసిపోవడాన్ని చూసిన నజీరుద్దీన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న రైతులు వచ్చి ఎంత పిలిచినా లేవకపోవడంతో నకిరేకల్ ప్రభు త్వ దవాఖానకు తరలించారు. నజీరుద్దీన్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. నజీరుద్దీన్ భార్య 6 నెలల క్రితం అనారోగ్యం తో మృతి చెందింది. ఇద్దరు కూతుళ్లకు వివాహం చేశాడు. నజీరుద్దీన్ ధాన్యం వివరాలపై ఇన్చార్జి తహసీల్దార్ యశ్వంత్‌ను వివరణ కోరగా స్పందించలేదు.